News January 29, 2025
సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులకు ALERT

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎన్విరాన్మెంటల్ పరీక్షలు రేపు ఉదయం 10గం. నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్య అధికారి గోవిందరామ్ తెలిపారు. అదేవిధంగా 31న ఇంటర్మీడియట్ ఫస్టియర్, ఫిబ్రవరి 1న సెకండియర్కు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Similar News
News December 16, 2025
మక్తల్: సర్పంచ్ ఎన్నికలు.. క్షుద్ర పూజల కలకలం

మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మామ.. ప్రత్యర్థి పార్టీల సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్ల ముందు నవధాన్యాలు, కుంకుమ, పసుపుతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
కేంద్రం సహకారంతో సజావుగా ఎరువుల పంపిణీ: ఎంపీ చిన్ని

రూ.31 వేల కోట్ల సబ్సిడీతో రైతులకు భరోసా కల్పించి, ఆంధ్రప్రదేశ్లో యూరియా సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం సహకరించిందని ఎంపీ కేశినేని చిన్ని మంగళవారం తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలతో రైతులకు ఎరువుల సరఫరా సజావుగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.


