News March 10, 2025
సంగారెడ్డి: ఇంటర్ సెకండీయర్ హాజరు 98.11%

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 16,084 మంది విద్యార్థులకు గాను 15,780 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%) ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 304 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 11, 2025
ప్రణయ్ హత్య కేసులో వెనకడుగు వేయని పీపీ ‘దర్శనం నరసింహ’

2018లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును వాదించడానికి అప్పట్లో లాయర్లు వెనకడుగు వేశారు. సీనియర్ న్యాయవాది దర్శనం నరసింహ ఈ కేసును వాదించడానికి ముందుకు వచ్చారు. దీంతో ప్రణయ్ తండ్రి పెరుమాండ్ల బాలస్వామి అభ్యర్థన మేర జిల్లా కలెక్టర్ 2019లో ఈ కేసును వాదించడానికి దర్శనం నరసింహను స్పెషల్ పీపీగా నియమించారు. ఈ కేసు తీర్పు సోమవారం వెలువడి ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది.
News March 11, 2025
జగిత్యాల :గ్రీవెన్స్ డే లో 14 అర్జీదారులు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు అర్జీదారుల సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
News March 11, 2025
2027 నాటికి భారత్‌లో భారీగా ఏఐ నిపుణుల కొరత

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.