News December 5, 2024

సంగారెడ్డి: ఇందిరా క్రాంతి రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందదిరా క్రాంతి పథకం రుణాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను త్వరగా ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఐ మేనేజర్ తాన్య, నాబార్డ్ డే కృష్ణ తేజ, లేట్ బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News December 6, 2025

మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.