News August 21, 2024
సంగారెడ్డి: ఇక BRS ఎప్పటికీ గెలవదు: జగ్గారెడ్డి

KTR రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తీసేస్తాం అంటారా? మీరు తీసేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండాలని లోపల ప్రతిష్ఠిస్తున్నాం. BRS ఎప్పటికీ గెలవదు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే’ అని అన్నారు.
Similar News
News October 30, 2025
మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
News October 30, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ ట్రాన్స్కో డీఈ

మెదక్ ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.21 వేల నగదు తీసుకుంటుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఓ పని విషయంలో నగదు తీసుకుంటూ పట్టు బడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు రావడంతో మెదక్ ట్రాన్స్కో కార్యాలయంలో సిబ్బంది లేకుండా పోయారు.
News October 30, 2025
మెదక్: రేపు బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మెదక్‌లోని PNR స్టేడియంలో ‘ఓపెన్ టు ఆల్’, 40+ వయసు విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆర్ఎస్సై నరేష్ (87126 57954) వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.


