News March 18, 2025
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన యువకుడు మృతి

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి మండలం కల్పగురు శివారులోని మంజీరా డ్యాంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన నరేష్ తమ్ముడు నరేంద్రతో కలిసి ఆదివారం మంజీరా డ్యామ్‌కు వెళ్లారు. నరేష్ ఈత కొడుతుండగా నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 7, 2025
భూపాలపల్లి: ఖర్చు లేకుండానే సోషల్ మీడియాలో ప్రచారం

జిల్లాలో 248 పంచాయితీలు, 2,102 వార్డులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్‌లలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి గ్రామంలో 5 కంటే ఎక్కువ వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 60 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామంలో చేసే అభివృద్ధి, ప్రచారం తీరుపై పోస్టులు పెడుతున్నారు.
News December 7, 2025
NRPT: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లాకు మూడో స్థానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ -14 బాలుర క్రికెట్ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాలుర క్రికెట్ జట్టు మూడో బహుమతి సాధించింది. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. రాబోయే రోజుల్లో ఆటలో చక్కటి ప్రతిభ చూపి మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్‌ను అభినందించారు.
News December 7, 2025
పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.


