News January 11, 2026

సంగారెడ్డి: ఈనెల 12న ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఈనెల 12న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారని, ఈ సందర్భంగా ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.

Similar News

News January 22, 2026

ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

image

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మద్యం సరఫరాదారుల నుంచి వసూలు చేసిన రూ.3,500 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.

News January 22, 2026

వంటింటి చిట్కాలు

image

* సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించేటపుడు చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే స్పూన్‌ శనగపిండి కలపండి చాలు.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో.. బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.

News January 22, 2026

గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

image

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.