News March 11, 2025
సంగారెడ్డి: ఈనెల 15న తల్లిదండ్రుల సమావేశం: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 15న తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
Similar News
News February 23, 2026
రంప: ఎర్రమట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లో అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలను ఆపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా మట్టి రవాణా భారీగా జరుగుతుందని, అనుమతి లేని మట్టిని తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రంపచోడవరంలో కలెక్టర్ దినేష్ కుమార్‌కు సోమవారం సీపీఎం నాయకులు వాణిశ్రీ, శాంతిరాజు వినతి పత్రాలు అందజేశారు.
News February 23, 2026
హాకీలో వనపర్తి బాలుర జట్టుకు కాంస్యం

హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ అండర్-19 హాకీ పోటీల్లో వనపర్తి జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జట్టు కోచ్ బొలెమోని కుమార్, క్రీడల అధికారి సుధీర్ రెడ్డి విజేతలను అభినందించారు. విద్యార్థుల ప్రతిభ జిల్లాకు గర్వకారణమని వారు కొనియాడారు.
News February 23, 2026
జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

రాబోయే గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల నుంచి కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాల ఏర్పాటు చూడాలన్నారు.


