News February 2, 2025
సంగారెడ్డి: ఈనెల 4న భౌతిక రసాయనశాస్త్ర ప్రతిభ పోటీ పరీక్ష

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఈనెల 4న నిర్వహించే బౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పోటీలకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆహ్వానిస్తూ జిల్లా బౌతికరసాయన ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నరేందర్లు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
సత్యసాయి జిల్లాలో దారుణం.. గర్భిణిపై దాడి

తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. టపాసులు పేల్చవద్దని కోరిన గర్భిణి సంధ్యారాణిపై వైసీపీ కార్యకర్త అజయ్ దాడి చేశాడు. ఆమెను కాలుతో తన్నడంతో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అజయ్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
News December 22, 2025
యూనస్ నాయకత్వం ‘బంగ్లా’కు ప్రమాదకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. యూనస్ నాయకత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. మైనారిటీలపై పెరుగుతున్న దాడులు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, భారత్ సహా పొరుగు దేశాలతో సంబంధాలకు ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులకు యూనస్ ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
News December 22, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.


