News March 30, 2025

సంగారెడ్డి: ఉగాది ఆధ్యాత్మిక ఆనందం: అవధూత గిరి

image

ప్రశాంతతకు ప్రకృతికి నిలయమైన బర్దిపూర్ దత్త క్షేత్రంలో ఆదివారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలుగు ప్రజలకు శ్రీ విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News April 22, 2025

ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

image

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 22, 2025

AP న్యూస్ రౌండప్

image

* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్‌పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా

News April 22, 2025

కొత్తపేట: జగన్‌ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

image

ఇటీవల కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్‌ను సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం కోనసీమ జిల్లాలో వైసీపీని మరింతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగ్గిరెడ్డికి సూచించనట్లు నాయకులు వెల్లడించారు.

error: Content is protected !!