News June 26, 2024
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

టైలరింగ్, బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణకేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళలోపు గల గ్రామీణ ప్రాంతాల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 20, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

22న సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, విపత్తులను ఎదుర్కొనే విషయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణలో పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరన్నారు.
News December 20, 2025
MDK: విపత్తులపై అప్రమత్తతే ప్రధానం: అదనపు కలెక్టర్ నగేష్

విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ నెల 22న హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాలో విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌ను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో పారిశుధ్య, వైద్య సేవలు కీలకమని పేర్కొన్నారు.
News December 20, 2025
మెదక్‌లో జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లు, లోక్ అదాలత్‌లో పరిష్కారానికి వచ్చే కేసుల వివరాలపై చర్చ జరిగింది. అనుకూల వాతావరణంలో కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానం, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.


