News November 7, 2024
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులని చెప్పారు. బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.
Similar News
News December 10, 2024
సంగారెడ్డి: మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన: కలెక్టర్
3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.
News December 10, 2024
ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం
పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.
News December 10, 2024
డిసెంబర్ 19న ఫుల్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఫుల్‌బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో క్రీడాకారుల ఎంపికలు డిసెంబ 19న నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.