News January 30, 2025

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు www.bcstudycircle.cgg.gov.inలో ఫిబ్రవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి 12 నుంచి 14 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

image

విమాన ప్రయాణ ఛార్జీలను ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘టారిఫ్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. విమాన టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికులు గమనిస్తే వాటి స్క్రీన్ షాట్లను మాకు పంపించొచ్చు’ అని వివరించారు. డొమెస్టిక్ మార్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ రూట్ల ఛార్జీలనూ మానిటర్ చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.

News December 15, 2025

చిన్నారుల్లో ఊబకాయాన్ని ముందే గుర్తించొచ్చు

image

ప్రస్తుతం చిన్నారుల్లోనూ ఊబకాయం ముప్పు పెరుగుతోంది. దీన్ని ముందే గుర్తించేందుకు సైంటిస్టులు పాలీజెనిక్‌ రిస్క్‌ స్కోర్‌ టెస్ట్‌ని క్రియేట్‌ చేశారు. దీనికోసం 50లక్షలకు పైగా జెనెటిక్‌ డేటాలను పరిశీలించారు. 5ఏళ్లలోపు పిల్లలకు పరీక్ష చేసి వచ్చిన స్కోర్‌‌తో ఫ్యూచర్‌లో ఒబెసిటీ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల జీవనశైలిలో మార్పులు చేసి ఒబెసిటీ బారిన పడకుండా చూడొచ్చు.

News December 15, 2025

కవ్వాల్‌లో ఆధార్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో అత్యవసర ఆధార్ ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. మంగళవారం కూడా కొనసాగుతుందని జన్నారం పోస్టల్ శాఖ ఏఎస్పీ రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లోని తప్పుల సవరణ, ఫొటో అప్‌డేట్, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మార్పులు వంటి అన్ని ముఖ్య సేవలను తక్షణమే వినియోగించుకోవాలని ఆయన కోరారు.