News March 12, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల సాధకుడు మనోహర్ రావు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కి చెందిన మనోహర్ రావు ప్రభుత్వ ఉద్యోగాల సాధకుడిగా మారారు. తాజాగా విడుదలైన గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. ఇతడు 2017లో PGT స్టేట్ 3వ ర్యాంక్, 2017లో TGT స్టేట్ 1వ ర్యాంక్, 2019లో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 2వ ర్యాంక్, 2020లో గ్రూప్-2లో స్టేట్ 3వ ర్యాంక్, 2025 లో JLలో స్టేట్ 4 ర్యాంక్ సాధించాడు.
Similar News
News January 3, 2026
GNT: మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. సతీ సమేతంగా విచ్చేసిన ఆయనను గుంటూరు వెల్కమ్ హోటల్ వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా స్వాగతం పలికారు. 4వ తేదీ ఉదయం 10.30 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు.
News January 3, 2026
నేరాల నియంత్రణే లక్ష్యం: ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని సీపీ సునీల్ దత్ తెలిపారు. శనివారం ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


