News March 12, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల సాధకుడు మనోహర్ రావు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కి చెందిన మనోహర్ రావు ప్రభుత్వ ఉద్యోగాల సాధకుడిగా మారారు. తాజాగా విడుదలైన గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. ఇతడు 2017లో PGT స్టేట్ 3వ ర్యాంక్, 2017లో TGT స్టేట్ 1వ ర్యాంక్, 2019లో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 2వ ర్యాంక్, 2020లో గ్రూప్-2లో స్టేట్ 3వ ర్యాంక్, 2025 లో JLలో స్టేట్ 4 ర్యాంక్ సాధించాడు.
Similar News
News April 18, 2026
సంగారెడ్డి: ఎన్నికలకు హాజరయ్యే హోంగార్డులకు మెడికల్ కిట్లు

తమిళనాడు ఎన్నికలకు హాజరయ్యే హోంగార్డు సిబ్బందికి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలో మెడికల్, నిత్యవసర కిట్లను శనివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కోసం ప్రథమ చికిత్స కిట్టుతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 18, 2026
మహిళా బిల్లును ప్రవేశపెట్టిన DMK

డీలిమిటేషన్‌కు లింక్ చేసి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు నిన్న వీగిపోయిన నేపథ్యంలో NDAకు కౌంటర్‌గా రాజ్యసభలో DMK ఈరోజు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్, సెన్సస్ అవసరం లేకుండా 543 లోక్‌సభ స్థానాల్లోనే 33% మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు, UTలైన పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ సహా ఢిల్లీ NCRకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సీట్లను, నియోజకవర్గ పరిధులను మార్చాల్సిన అవసరం లేదంది.
News April 18, 2026
రోజుకు 8 గంటలు కష్టపడుతున్న రష్మిక

రవీంద్ర పుల్లే డైరెక్షన్‌లో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న ఆమె యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. రోజుకు 8 గంటలపాటు స్టంట్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ట్రైనింగ్(ఆర్మీ తరహా శిక్షణ) తీసుకుంటున్నారు. త్వరలో కేరళంలో 16 రోజుల పాటు యాక్షన్ షెడ్యూల్‌కు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.


