News December 12, 2024
సంగారెడ్డి: ఉద్యోగుల వివరాలను సేకరించాలి: DEO
సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2025
పదేళ్ల BRS పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా..?: మంత్రి పొన్నం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయిన ఇచ్చారా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఇప్పుడు మేము కార్డులు ఇస్తామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. అర్హత ఉండి రాని వారు గ్రామ సభలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 21, 2025
రైల్వే ట్రాక్‌పై సిద్దిపేట జిల్లా అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రత వివరాలు.. కోహీర్ 7.0, ఆల్గోల్, న్యాల్కల్ 8.4, నల్లవల్లి 8.8, మల్చల్మ 9.0, కంకోల్ 9.1, సత్వార్ 9.2, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 9.4, నిజాంపేట, ఝరాసంఘం, దిగ్వాల్ 9.6, కల్హేర్ 9.8, కంగ్టి 9.9, అంగడికిష్టాపూర్, లక్ష్మీసాగర్, మొగుడంపల్లి 10.2, కొండపాక, గౌరారం, జహీరాబాద్ 10.3, పోతారెడ్డిపేట, బేగంపేట 10.4, శివంపేట 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.