News January 23, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు డీఈవో హెచ్చరిక

ఉపాధ్యాయులు పాఠశాలల సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం హెచ్చరించారు. కొందరు ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలకు వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమయపాలనపై పరిశీలన చేయాలని సూచించారు. పాఠశాల సమయాల్లో బయటకు వెళ్లొద్దని చెప్పారు.
Similar News
News November 20, 2025
రాజన్న ఆలయ ఏఈఓకు ప్రచార రథం బాధ్యతలు అప్పగింత

వేములవాడ రాజన్న ఆలయం సహాయ కార్య నిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌కు స్వామి వారి ప్రచార రథం ఏఈఓగా బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ప్రచార రథం వద్ద దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీనివాస్‌కు ప్రచార రథం వద్ద అదనపు బాధ్యతలు అప్పగించారు. భీమేశ్వరాలయంతో పాటు మరికొన్ని విభాగాలకు ఆయన ఏఈఓగా కొనసాగుతారు.
News November 20, 2025
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News November 20, 2025
తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.


