News March 19, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి: డీఈవో

పదో తరగతి పరీక్షా విధులు నిర్వహించే ఉపాధ్యాయులను 20వ తేదీన రిలీవ్ చేయాలని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు చీఫ్ సూపరింటెండ్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. 21 నుంచి వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు.
Similar News
News December 8, 2025
సిద్దిపేట: ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవీఎం) గోదాంని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్శనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్లను భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్లను పరిశీలించారు.
News December 8, 2025
ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

* డెంటల్ ప్రాబ్లమ్స్ లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య అనిపించేలా దవడ నొప్పి
* పుల్లటి త్రేన్పులు, తరచూ వికారంగా ఉండడం, వాంతులు.
* అజీర్ణ సమస్యలు. ఫుడ్ పాయిజన్ కారణమనే భావన.
* హార్ట్బీట్లో హెచ్చుతగ్గులు.
* వెన్నెముక పైన, భుజం బ్లేడ్ల మధ్యలో, బ్రెస్ట్ కింది భాగంలో నొప్పి.
* శారీరక శ్రమ లేకున్నా చెమటలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
* ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు
News December 8, 2025
డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


