News January 31, 2025
సంగారెడ్డి: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన నరేశ్(28) మానసిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నరేశ్ ఎంబీఏ పూర్తి చేశాడు. గత 6ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా గురువారం తన ఇంట్లోని బెడ్రూంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
అల్లూరిలో ఎన్కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
News November 18, 2025
నెల్లూరు: సంగం వద్ద RTC బస్సుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా సంగం వద్ద RTC బస్సుకు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్తో బస్సుకింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మంటలు గమనించి బైక్తో బస్సును చేజ్ చేసి ఆపాడు. అనంతరం బస్సులోని వారందరినీ డ్రైవర్ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
News November 18, 2025
మెదక్: కక్షపూరిత కేసులపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీకి ఫిర్యాదు

మెదక్ బీఆర్ఎస్ టౌన్ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసును రద్దు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అన్నారు. ఆంజనేయులుపై కేసును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.


