News November 16, 2024

సంగారెడ్డి: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇవాళ ఉదయం జరిగింది. వెంటనే స్పందించిన సిబ్బంది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 28, 2026

మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

image

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.

News February 28, 2026

మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.

News February 28, 2026

మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

image

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.