News March 1, 2025

 సంగారెడ్డి: ఉర్దూ మీడియం పాఠశాల వేళల్లో మార్పులు: DEO

image

రంజాన్ నెల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఉర్దూ మీడియం పాఠశాల వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ మార్పులు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని చెప్పారు.

Similar News

News November 20, 2025

NZB: అర్ధరాత్రి వరకు కొనసాగిన ACB సోదాలు (UPDATE)

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో నిన్న <<18329466>>ACB సోదాలు<<>> జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. టౌన్ ప్లానింగ్‌లో పలువురి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

News November 20, 2025

బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

image

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 20, 2025

ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

image

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని దీంతో అపార్ ఐడీకి పెద్ద చిక్కులు వస్తున్నాయట.