News February 8, 2025

సంగారెడ్డి: ‘ఎంఆర్సీలో అపార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

అపారు ఐడి కోసం ఆధార్ కార్డులో వచ్చిన తప్పులను సరిచేసేందుకు ఎంఆర్సీ కేంద్రాలలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలనీ కోరుతూ టీటీయు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News February 23, 2026

సంగారెడ్డి: రాత్రి యువకుడిపై కర్రతో దాడి

image

సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. 10 గంటల సమయంలో చాకలి వీరేశం, రంజిత్ మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రంజిత్ కర్రతో దాడి చేయడంతో వీరేశం తలకు బలమైన గాయమైంది. 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 23, 2026

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవొచ్చని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.

News February 23, 2026

MHBD: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు

image

బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి కుంజా మధు అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మాయమాటలతో బాలికను శారీరకంగా లోబర్చుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెల్లడించారు.