News September 1, 2024

సంగారెడ్డి: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్‌కు ఎంపికైన ఫ్రెష్, రెన్యువల్ అభ్యర్థులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేది వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 15 లోపు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో వెరిఫికేషన్ చేయాలన్నారు.

Similar News

News November 17, 2024

మెదక్: రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఎన్నిక

image

మెదక్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కానుగు రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం మెదక్ లో ఎన్నికలు నిర్వహించారు. జనరల్ సెక్రెటరీగా విద్యాసాగర్, ట్రెజరర్‌గా రాజు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌గా జాయింట్ సెక్రటరీలుగా బి. కిషన్, పి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అస్లాం ఖాన్, పోచయ్య, గౌరవాధ్యక్షుడిగా పి. శెట్టయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, యాదగిరి, అనిల్ ఎన్నికయ్యారు.

News November 17, 2024

ఝరాసంగం: పాము కాటుతో విద్యార్థి మృతి

image

పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఝరాసంగం మండల మంచునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. ధనసిరి బాబు, మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద పత్తి చేనులో పాము కాటుకు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 17, 2024

మెదక్: డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి హత్య

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో డబ్బుల విషయంలో మేస్త్రీల మధ్య గొడవ జరిగి ఒకరు హత్యకు గురయ్యారు. పోలీసుల వివరాలు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రమోద్ (40), బిట్టు మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. ప్రమోద్ వద్ద పని చేస్తున్న బిట్టు రాత్రి మద్యం తాగిన సమయంలో డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. బిట్టు కట్టెతో దాడి చేయగా ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.