News February 19, 2025

సంగారెడ్డి: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

ADB: 69 ఏళ్ల తర్వాత ఎన్నిక.. సర్పంచ్‌గా దేవురావు

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. బరంపూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవురావు విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సిడం లక్ష్మణ్‌పై 300పైగా ఓట్లతో గెలుపొందారు.

News December 17, 2025

జనవరి నుంచి ‘ఈ-ఆఫీస్’ విధానం: జేసీ

image

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం కోసం జనవరి నుంచి పూర్తిస్థాయిలో ‘ఈ-ఆఫీస్’ విధానం అమల్లోకి రానుందని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్‌లైన్ ద్వారానే సాగుతాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ సాఫ్ట్‌వేర్ నిర్వహణపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News December 17, 2025

ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

image

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.