News February 19, 2025
సంగారెడ్డి: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News March 21, 2025
అలా చేస్తే టీమ్ ఇండియాలో చోటు: సురేశ్ రైనా

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. IPLలో 500 పరుగులు చేస్తే ఇండియా టీమ్‌లో చోటు దక్కే అవకాశముందని అన్నారు. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, జైస్వాల్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. చాలా మంది ప్లేయర్లు తన టాలెంట్‌ను ప్రదర్శించి అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటారని పేర్కొన్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా.. టీ20WC, వన్డే WC, CT నెగ్గిన భారత జట్టులో సభ్యుడు.
News March 21, 2025
సామర్లకోట: రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందికి జారిపడడంతో తలకు బలమైన గాయమై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలో జి.మేడపాడు స్టేషన్ వద్ద గురువారం జరిగింది. ప్రమాద సమయంలో కొన ఊపిరితో ఉన్న యువతిని రైల్వే ఉద్యోగులు గుర్తించి చికిత్స నిమిత్తం సామర్లకోట తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.