News February 12, 2025
సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. అలర్ట్‌గా ఉండండి: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేయకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News March 16, 2025
ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2025
గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.
News March 16, 2025
సిద్దిపేట: ప్రతి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉంటా: MLC

ప్రతి ఉపాధ్యాయునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఇటీవలే నూతనంగా గెలిచిన ఎమ్మెల్సీని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాజ్, సురేశ్ ఆధ్వర్యంలో పలువురు టీచర్లు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. విజయానికి కృషి చేసిన తపస్ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అండగా ఉంటానన్నారు.