News February 26, 2025
సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్‌లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్‌ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
మత్తు పదార్థాల జోలికి యువత పోవద్దు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News November 18, 2025
మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.


