News March 7, 2025
సంగారెడ్డి: ఎఫ్ఎల్ఎన్ సర్వే పక్కాగా నిర్వహించాలి: డీఈవో

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 10 నుంచి 12 వరకు ఎంపిక చేసిన పాఠశాలలలో ఎఫ్ఎల్ఎన్ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఈ పరీక్షను రెండో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్నట్లు, దీనివల్ల విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.