News February 9, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మాస్టర్ ట్రేడర్ కళింగ కృష్ణకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని డిఆర్ఓ పద్మజ రాణి తెలిపారు.
Similar News
News February 17, 2026
ADB: విలువలను గంగకొదిలిన పార్టీలు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల సమయంలో పరస్పరం విమర్శలు చేసుకున్న ప్రధాన పార్టీలు ఫలితాల తర్వాత అధికారం కోసం ఒక్కటయ్యాయి. సిద్ధాంతాలు, విలువలు పక్కనబెట్టి పదవులే లక్ష్యంగా కూటమిగా మారాయి. ప్రజల తీర్పునకు విరుద్ధంగా పార్టీలు కలవడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. అధికారం కోసం పార్టీలు చేతులు కలపడంపై మీ కామెంట్.
News February 17, 2026
ఉండిలో చెదిరిపోతున్న టీడీపీ శ్రేణులు(1/2)

ఉండి నియోజక వర్గంలో తెలుగుదేశం శ్రేణులు చెదిరిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే రఘురామ కారణంగా పార్టీ భ్రష్టు పట్టిపోతోందని పార్టీ నేతలు మీడియా ముందు <<19160222>>ఆరోపణలు చేస్తున్నారు<<>>. RRR ప్రధాన అనుచరుడు కొత్తపల్లి నాగరాజు షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారట. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ, ద్వితీయ స్థాయి నాయకులు గానీ నేరుగా MLAతో మాట్లాడే అవకాశం లేకుండా పోతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.
News February 17, 2026
కూటమి ప్రజాప్రతినిధులతోనూ RRR కయ్యం(2/2)

మరోవైపు పక్కన ఉన్న నియోజకవర్గాల్లోనూ RRR తల దూర్చి అక్కడ కూడా వార్తల్లో నిలుస్తున్నారు అనేది విమర్శ. ఇటీవల భీమవరం సీఐ జయసూర్య విషయంలో, కలెక్టరేట్ మార్పు విషయాల్లో RRRకు, భీమవరం MLA పులపర్తి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవే భవిష్యత్‌లో కొనసాగితే TDPకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.


