News February 27, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగారెడ్డి ఆర్టీవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.0°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.4, నుస్తులాపూర్ 37.1, తాంగుల, పోచంపల్లి 36.3, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లె 35.9, జమ్మికుంట 35.7, అర్నకొండ 35.6, కరీంనగర్ 35.5, తాడికల్, దుర్శేడ్, కొత్తపల్లి-ధర్మారం 35.4, కొత్తగట్టు 35.1, గంగాధర 34.9, గుండి 34.8, వీణవంక 34.6, ఇందుర్తి 34.5, వెదురుగట్టు 34.2°Cగా నమోదైంది.
News February 27, 2025
BNGR: టైర్ పగిలి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి గాయం..

రోడ్డుపై వెళ్తున్న వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలైన ఘటన భువనగిరిలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల వివరాలిలా.. ములుగు జిల్లా జగన్నాథపురానికి చెందిన రామలక్ష్మి బంధువుల ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదైంది.
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.