News February 26, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు ఇలా..

సంగారెడ్డి జిల్లా గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్ల వివరాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి మంగళవారం వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 25,626, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 2,626 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 40, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగంచుకోవాలన్నారు.
Similar News
News February 25, 2026
గుంతకల్లు డివిజన్లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించాలని కోరారు.
News February 25, 2026
VKB: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. వికారాబాద్‌లో 28 పరీక్షా కేంద్రాల్లో 8,384 మంది 1st ఇయర్, 8,006 మంది 2nd ఇయర్ విద్యార్థులు రాయనున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు తదితరాలు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
ALL THE BEST
News February 25, 2026
రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.


