News February 25, 2025
సంగారెడ్డి: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News December 2, 2025
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
ఉమ్మడి వరంగల్ అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 6 జిల్లాల అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక కోసం ఈ నెల 4న వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ పోటీల ద్వారా జిల్లా జట్టును ఎంపిక చేస్తారని డబ్ల్యూడీసీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. క్రీడాకారులు తప్పక హాజరుకావాలని కోరారు.


