News August 17, 2024

సంగారెడ్డి: ఐటీఐలో ప్రవేశాలకు నేడు ఆఖరు

image

ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేటితో గడువు ముగియనుందని కన్వీనర్ రాజేశ్వర్ రావు తెలిపారు. ఆసక్తిగల వారు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో ఫేజ్ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 16, 2025

మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

News November 15, 2025

మెదక్: హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమంపై సమీక్ష

image

హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమార్థం యాక్సిస్ బ్యాంక్ అధికారులతో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సమీక్షించారు. హోమ్ గార్డుల ఆర్థిక భద్రత, సామాజిక సంక్షేమం లక్ష్యంగా సమీక్ష చేశారు. హోమ్ గార్డులు జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజల రక్షణలో ఎల్లప్పుడు ముందుంటున్న ఈ సిబ్బందికి అవసరమైన సహాయం, మార్గదర్శక, సంక్షేమ కార్యక్రమాలను అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.

News November 15, 2025

తూప్రాన్: మహిళ ఆత్మహత్య

image

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.