News March 15, 2025
సంగారెడ్డి: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇయితే ఈ బడుల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
Similar News
News March 16, 2025
పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి టీజీ భరత్

రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

ప్రజా భవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.