News March 16, 2025
సంగారెడ్డి: కమిషనర్లు, మేనేజర్లకు షోకాజ్ నోటీసులు

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వస్తువులు నిర్లక్ష్యం వహించిన అధికారులకు శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతి నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు ప్రసాద్ చౌహన్, ఉమ, ఉమ మహేశ్వర రావు, సూర్య ప్రకాష్, ఉమర్ సింగ్, ఉమేశ్వర్ లాల్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు సంగారెడ్డిలో 27, జహీరాబాద్లో 8, సదాశివపేటలో 14 మంది బిల్ కలెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చారు.
Similar News
News December 7, 2025
గల్లంతైన ఆరు గ్యారంటీలు: డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
News December 7, 2025
కరీంనగర్ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా జీపీవో అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనె రమేష్, సాగర్, అనిల్, కోశాధికారి హరీష్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా నలువాల సాయికిషోర్, నీర్ల రేవంత్, జెట్టి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా పెంటి మమత, ఉపాధ్యక్షురాలుగా చందన, వనితలు ఎన్నికయ్యారు. తహశీల్దార్ బండి రాజేశ్వరి నూతన కమిటీని అభినందించారు.
News December 7, 2025
రెండో విడత.. 415 స్థానాలు ఏకగ్రీవం

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.


