News August 31, 2024
సంగారెడ్డి: కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08455 276155 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో వర్షాలపై సమీక్ష శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా వర్షాలతో ఇబ్బంది పడితే నేరుగా ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2025
మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.
News November 24, 2025
మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.


