News January 23, 2025

సంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రచార రథం ప్రారంభం

image

కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రచార రథాలను అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు మోటర్‌గా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News February 6, 2025

ఏనుగులూ పగబడతాయ్!

image

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.

News February 6, 2025

భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

image

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్‌, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.

News February 6, 2025

ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

image

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.

error: Content is protected !!