News August 14, 2024
సంగారెడ్డి కలెక్టరేట్‌లో ధరణి సహాయ కేంద్రం
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఎవరికి చేయాలో తెలియక వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు నిరాశతో విని తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ధరణి సహాయ కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఏర్పాటు చేయించారు. సమస్యలపై రైతులు ఇక్కడ సంప్రదించవచ్చని తెలిపారు.
Similar News
News September 15, 2024
అమీన్ పూర్: ఆన్ లైన్ టాస్క్ పేరుతో రూ.4.6 లక్షల స్వాహా
ఉద్యోగం చేసుకుంటూ ఆన్ లైన్ ఇచ్చే టాస్క్‌లో పూర్తి చేస్తే కమిషన్ వస్తుందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ మోసగాడు రూ.4.6 లక్షల కాజేశాడు. సిఐ నాగరాజు కథనం ప్రకారం.. కృష్ణారెడ్డి పేటలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మార్చి 18న మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే టాస్కులు ఇస్తామని ఆశ చూపారు. దఫా దఫాలుగా డబ్బులు చెల్లించాడు. కమిషన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 15, 2024
ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News September 15, 2024
సిద్దిపేట: నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఈనెల 30 వరకు పోలీస్ కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట CP అనురాధ తెలిపారు. జిల్లాలోని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించకూడదని అన్నారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు.