News April 15, 2025
సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

భార్యను భర్త <<16097179>>హత్య చేసిన<<>> ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News December 2, 2025
ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.
News December 2, 2025
యాదాద్రి : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నామినేషన్

కనిపించని దేవుడి కన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలంటుంటారు. ఇక ప్రతి బిడ్డ విజయం వెనుక వారు ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల తరుణంలో యాదాద్రి జిల్లా రామన్నపేట(మం) ఇంద్రపాలనగరానికి చెందిన గర్దాస్ విక్రమ్.. BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి ముందు ఆయన వారి అమ్మనాన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడిని పలువురు అభినందిస్తున్నారు.
News December 2, 2025
రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

యాదాద్రి(D) రాజాపేట(M) రేణికుంట గ్రామ పంచాయతీకి గతంలో రాష్ట్ర ఉత్తమ అవార్డు లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందిన తమ గ్రామానికి హరితహారం, స్వచ్ఛభారత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు కూడా లభించిందని మాజీ సర్పంచ్ భాగ్యమ్మ తెలిపారు. స్వయం సమృద్ధి విభాగంలో 2021-22లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బెస్ట్గా నిలిచిన ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


