News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కొండాపూర్‌లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 23, 2026
ఏలూరు: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, ప్రశ్నపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటును ఆమె సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
News February 23, 2026
హలీమ్ చెఫ్‌లకు అదిరిపోయే ప్యాకేజీలు.. రోజుకు ఎంతంటే..

TG: రంజాన్ సీజన్‌లో హలీమ్ చెఫ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని పెద్ద హోటళ్లు రోజుకు కనీసం ₹5 వేలు చెల్లిస్తున్నాయి. ఇతర పట్టణాల్లోనూ హైదరాబాద్ నుంచి చెఫ్‌లను పిలిపించుకుని రోజుకు ₹3 వేలు చెల్లిస్తున్నారు. కొన్ని బడా హోటళ్లు, రెస్టారెంట్లు 6 నెలల ముందే వారిని బుక్ చేసుకోవడం గమనార్హం. రంజాన్ తర్వాత హలీమ్ చెఫ్‌లు హైదరాబాద్‌లోని క్యాటరింగ్ సెంటర్లు, హోటళ్లలో బిర్యానీ తయారీలో బిజీగా ఉంటారు.
News February 23, 2026
ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రభావం

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గట్లు మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.


