News April 11, 2025

సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

image

కొండాపూర్‌లో పిడుగు పడి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గంగారానికి చెందిన సంతోశ్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపడి సంతోశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

సర్వదర్శనానికి 8 గంటల పైనే

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 64,065 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోగా.. 25,250 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.57 కోట్లు ఆదాయం వచ్చింది.

News October 29, 2025

కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

image

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.