News February 1, 2025

సంగారెడ్డి: కేంద్ర మంత్రుల మాటలు కోతలే.. నిధులేవి: జగ్గారెడ్డి

image

తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి ఇద్దరు కేంద్ర మంత్రులు చేస్తే బడ్జెట్లో మాత్రం అన్యాయం చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రుల మాటలు కోతలేనని.. నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.

Similar News

News November 28, 2025

గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.

News November 28, 2025

పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

image

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

News November 28, 2025

సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి: ఏలూరు కలెక్టర్

image

సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు.