News February 14, 2025
సంగారెడ్డి: కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్ర మంత్రికి ఆహ్వానం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 26న సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరిగే కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.1.08 కోట్ల రుద్రాక్షలతో 18.5 అడుగుల శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 15, 2025
KMM: విద్యార్థులను బయటకు పంపితే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం బకాయిల కోసం తరగతి గదుల నుంచి పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని కలెక్టరెట్‌లోని మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి వీలు లేదన్నారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
News October 15, 2025
ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.
News October 15, 2025
రామాయంపేట: ఇంట్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివనగర్ తండాలో మంగళవారం రాత్రి మున్యా(36) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.