News September 23, 2024
సంగారెడ్డి: క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టును సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News October 5, 2024
రాజగోపురంలో అన్నపూర్ణ దేవిగా ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు శనివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాతను నీలం రంగు వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్రఘంటాదేవి)రూపంలో అలంకరించారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు రావికోటి-శంకర్ శర్మ ఆధ్వర్యంలో రాజ గోపురంలో శ్రీ వన దుర్గభవాని అమ్మవారికి మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి నీలం రంగు వస్త్రాలతో అన్నపూర్ణ దేవిగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు.
News October 5, 2024
సంగారెడ్డి: పండుగ దృష్ట్యా 542 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో 542 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమైంది. సంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంగారెడ్డి ఆర్ఎం ప్రభులత తెలిపారు.ఆర్టీసీ చెందిన 334 సర్వీసులు, హైర్ బస్సులు 208 నడుపుతున్నామన్నారు. రద్దీ ఉంటే మరిన్ని నడుపుతామన్నారు.
News October 5, 2024
సంగారెడ్డి: రేపటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా 6 నుంచి 13 తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శనివారం ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల్లో ఏవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.