News November 27, 2024
సంగారెడ్డి: క్రిస్టియన్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
క్రిస్మస్ సందర్భంగా గౌరవ సత్కారం కోసం అర్హులైన క్రిస్టియన్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. సామాజిక, సేవారంగం, విద్యారంగం, వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులు డిసెంబర్ 5వ తేదీ లోగా కలెక్టర్ కార్యాలయంలోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Similar News
News December 2, 2024
గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!
సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
News December 2, 2024
సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్ గ్రామానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. స్థానిక హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బండతిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును నిర్మించారు.
News December 2, 2024
సిద్దిపేట: నేడు సీఎం పర్యటన షెడ్యూల్
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరించారు.