News March 6, 2025

సంగారెడ్డి: క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం: కలెక్టర్

image

క్రీడలు ఆడడం వల్ల మహిళల్లో ఆత్మహత్య పెరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను బుధవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులతో ఉత్సాహంగా కలెక్టర్ క్యారం బోర్డు ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆటలు చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. డీఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

image

PM మోదీ మరోసారి ట్రంప్‌కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.

News January 16, 2026

కీసర టోల్‌గేట్ వద్ద పెరిగిన రద్దీ.. పోలీసుల చర్యలు

image

కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ ముగించుకొని హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. టోల్ గేట్ వద్ద ఎటువంటి వాహనాలు నిలవకుండా చర్యలు చేపట్టి, నిరంతర వాహనాల ప్రవాహానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారు.

News January 16, 2026

గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

image

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.