News February 1, 2025
సంగారెడ్డి: గంజాయి అమ్మి జైలు పాలయ్యాడు

గంజాయి అమ్మిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జడ్జి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2009 సంవత్సరంలో సంగారెడ్డిలో 5 కిలోల గంజాయి విక్రయిస్తూ మహమ్మద్ సెమీ అన్సారి అలియాస్ బిలాల్‌ను అప్పటి ఎక్సైజ్ సీఐ మధుబాబు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేసిన మధుబాబును అభినందించారు.
Similar News
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
News September 16, 2025
HYD: పడితే కుటుంబాలు రోడ్డున పడతాయ్!

ట్రాలీ నిండా సామాన్లు.. పైన కట్టెలు.. వాటిపైనే ప్రాణాలను ఫణంగా పెట్టిన కూలీలు. అదుపు తప్పితే వారితో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని మరిచిపోతే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నియమాలను పాటించాలని పోలీసులు చెబుతుంటే పెడచెవిన పెట్టి ప్రమదాలకు గురవుతున్నారు. ఫైన్లు వేసినా భయం లేదు. ఈ దృశ్యం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో కనిపించింది. ఇలాంటి ప్రయాణాలు విషాదాంతంగా మారుతాయని గుర్తించండి.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.