News March 22, 2024
సంగారెడ్డి: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆహ్వానం
సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ కోఆర్డినేటర్ భీమయ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://WWW. TSWREIS.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 11, 2024
MDK: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు
కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 640 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
News September 11, 2024
MDK: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌లు ఉన్నాయి. SHARE IT
News September 10, 2024
దుబ్బాక: ఆస్తి విషయంలో తండ్రితో గొడవ.. కొడుకు సూసైడ్
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.