News March 12, 2025
సంగారెడ్డి: గ్రూప్-2లో జిల్లా వాసికి 3వ ర్యాంక్

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావుకు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించాడు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించాడు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీఓలో మెదక్ జిల్లాకు వచ్చాడు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.
Similar News
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్

TG: దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తోన్న <<18297457>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉండగా రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పైరసీల ద్వారా అతను రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.
News November 15, 2025
మల్యాలలో వీఓఏల సమావేశం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్యాల బ్రాంచ్ పరిధిలోని వివోఏల ప్రత్యేక సమావేశం శనివారం సెర్చ్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌జడ్‌బీ బ్రాంచ్ ఏజీఎం శ్రీలత మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ నెల 18న రుణమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి బ్యాంకు రుణాలను అందించాలని ఆమె వివోఏలను కోరారు. ఈ కార్యక్రమంలో రాంకుమార్, పాషా, ఏపీఎం దేవరాజం పాల్గొన్నారు.
News November 15, 2025
JGTL: నువ్వులు క్వింటాల్ ధర @9,666

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శనివారం (15-11-2025) వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2061, కనిష్ఠ ధర రూ.1751, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2055, కనిష్ఠ ధర రూ.1985, వరి ధాన్యం (BPT) ధర రూ.2061, వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2160, కనిష్ఠ ధర రూ.2000, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2880, కనిష్ఠ ధర రూ.1950, నువ్వుల ధర రూ.9666గా మార్కెట్ అధికారులు తెలిపారు.


