News November 16, 2024
సంగారెడ్డి: గ్రూప్-3 పరీక్షకు అర గంట ముందే గేట్లు మూసివేత
ఈనెల 17,18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు అర గంట ముందే గేట్లు మూసివేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఉ.9:30 నుంచి మ.2.30 గంటల తర్వాత పరీక్షకు అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు 2 గంటల ముందు గాని పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
Similar News
News December 14, 2024
మెదక్: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టారన్నారు. డిసెంబర్‌లో 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందన్నారు.
News December 14, 2024
సంగారెడ్డి : నేటి లోక్అదాలత్ జిల్లా వ్యాప్తంగా 7బెంచీలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. సంగారెడ్డిలో మూడు బెంచీలు, జోగిపేటలో ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, జహీరాబాద్ ఒకటి, మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు, కేసు పెండింగ్లో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 14, 2024
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.