News March 30, 2025

సంగారెడ్డి: ‘చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి’

image

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వివిధ వర్గాల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎవరికైనా న్యాయసహాయం ఉచితంగా కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు. సమావేశంలో సంస్థ కార్యదర్శి రమేష్, సిఐ రమేష్ పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని మంత్రికి వినతి

image

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హుస్నాబాద్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్లుగా బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బకాయిలు విడుదలయ్యేలా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

News November 23, 2025

వాన్‌ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

image

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్‌ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.

News November 23, 2025

పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

image

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.